![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 మొదలై వంద రోజులు పూర్తయింది. నిన్నటి నూట నాలుగవ ఎపిసోడ్ లో సంజన , కళ్యాణ్ పడాల జర్నీ వీడియోలతో ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్ కి అందింది.
కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అసాధారణ ఆటతీరుతో విశేష ప్రేక్షకాదరణ పొందాడు. నిన్నటి వరకు సాగిన ఓటింగ్ లో కళ్యాణ్ మొదటి స్థానంలో ఉండగా..తనూజ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు. నాల్గవ స్థానంలో డీమాన్ పవన్ ఉండగా సంజన అయిదో స్థానంలో ఉంది. అయితే కొన్ని ఓటింగ్ పోల్స్ లో మూడో స్థానంలో డీమాన్ పవన్ ఉన్నాడు. కానీ మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ అంటేనే ట్విస్ట్ లు టర్న్ లు.. అలాంటిది ఏది ముందే చెప్పలేం. కాబట్టి ఆదివారం రాత్రి వరకు సాగే ఈ ఫినాలే కోసం వెయిట్ చేయాల్సిందే.
కళ్యాణ్ పడాల ఓ సైనికుడు.. అన్నింటికి మించి సామాన్యుడు. అతడికి హౌస్ లో ఎంట్రీ అయిన నుండే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. అయితే అమ్మాయిలని హగ్ చేసుకుంటాడు అనే రమ్య మోక్ష అన్నప్పుడు కుడా తను అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. డీమాన్ పవన్ , కళ్యాణ్ మధ్య సాగిన ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో.. బ్యాక్ పెయిన్ తో డీమాన్ పడిపోయాడు. అప్పుడు కూడా కళ్యాణ్ గేమ్ ఆడలేదు.. ఎందుకంటే అపోజిట్ లో ఉన్న డీమాన్ పవన్ లేచి ఆడతాడేమోనని వెయిట్ చేశాడు. ఇది ఒక్కటి చాలు.. ఒక గేమర్ ఎలా ఉండాలో తెలియజేయడానికి. ఇమ్మాన్యుయేల్ తరుపున ఆడినప్పుడు ఓడిపోయాడు దాంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు కళ్యాణ్. ఒక నిజమైన ఎమోషన్ ని కళ్యాణ్ లో ప్రతీ ఒక్క ఆడియన్ చూశాడు. అందుకే అతడికి ఓటింగ్ భారీగా పడింది. తనూజకి కళ్యాణ్ కి మధ్య ఇరవై శాతం ఓటింగ్ తేడా ఉందంటే అతను ఎంతమంది ప్రేక్షకులని గెలిచాడో అర్థం చేసుకోవచ్చు. తనూజ వర్సెస్ కళ్యాణ్ మధ్య సాగిన పోటీలో ఎవరు గెలిచారనేది తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.
![]() |
![]() |